బెస్త కార్పోరేషన్ కు నిధులు మంజూరు చేయాలి : టిజి భరత్
కర్నూలు టౌన్, నవంబర్ 14, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బెస్త కార్పోరేషన్ కు నిధులు మంజూరు చేయాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద బెస్త కార్పోరేషన్ కు నిధులు మంజూరు చేయాలంటూ టిడిపి ఆద్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలకు టిజి భరత్ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పోరేషన్లకు నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. కార్పోరేషన్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇతర రాష్ట్రాలలో కార్పోరేషన్ల పట్ల అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసుకున్న సలహాదారులైనా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బెస్త కార్పోరేషన్ కు నిధులు మంజూరు చేయాలన్నారు.