గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
గ్రంథాలయ అధికారిణి కవితాభాయి
డోన్, వెల్దుర్తి, నవంబర్ 19, (సీమకిరణం న్యూస్) :
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రంథాలయ అధికారిణి కవితా భాయి పిలుపునిచ్చారు.
55వ గ్రంథాలయ వారోత్స వాల్లో భాగంగా శనివారం డోన్ గ్రంథాలయం ఇన్చార్జిగా ఉన్న గ్రంథాలయ అధికారిణి కవితాబాయి ఆధ్వర్యంలో ద్రోణాచలం బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిని కవితా భాయి మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పలు పోటీలలో పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచారని వారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగ డానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యాస రచన, వకృత్వ, క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవం బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ బహుమతి ప్రధానం చేస్తున్నాం కానీ, ఈ సంఖ్యను భవిషతులో మరింత పెంచి ఎంతో మంది విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తామని తెలిపారు. జిల్లా,రాష్ట్ర, అంతర్జా తీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు వీరిని తీర్చిదిద్ద వలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అలాగే జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు.
అనంతరం గ్రంథాలయ అధికారిణి కవిత బాయి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న మినీ గ్రంథాలయాలు, సంచి గ్రంథాలయాల విషయం తెలుసు కొని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కవితా బాయీని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.