మిడ్ డే మీల్స్ తనిఖీ చేసిన జడ్పిటిసి
వెల్దుర్తి, నవంబర్ 19, (సీమకిరణం న్యూస్):
మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారంగా నాణ్యతతో కూడుకున్న భోజనాన్ని వడ్డించాలని వెల్దుర్తి మండలం జడ్పిటిసి దారి పోగు సుంకన్న అన్నారు. శనివారం వెల్దుర్తి ప్రభుత్వ బాలుర పాఠశాల నందు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ ఆరుబయట మిడ్ డే మీల్స్ వడ్డించకూడదని తెలిపారు. ఆరో ప్లాంట్ తయారు చేయిస్తామని జెడ్పిటిసి కి ప్రధానోపాధ్యాయులు జమ్మన్న విన్నవించారు. శనివారం బెల్లంతో కూడుకున్న అన్నం, సాంబారు అన్నం వడ్డించినట్లు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి మధ్యాహ్న భోజనాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటి దగ్గర క్యారీ బాక్స్‌లు తెచ్చుకోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జమ్మన్న విద్యార్థులు తదితరులు ఉన్నారు.