TELANGANA

– వైద్య విద్యార్థికి హంస పౌండేషన్ ఆర్థిక సహాయం.

వైద్య విద్యార్థికి హంస పౌండేషన్ ఆర్థిక సహాయం
చిట్యాల,మార్చి 11, (సీమకిరణం న్యూస్) : 
ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వైద్య విద్యలో నాలుగో సంవత్సరం కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్న చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ అఫ్జల్ కుమారుడు అజారుద్దీన్ కు హంస ఫౌండేషన్ ఆర్ధిక సాయం అందజేసింది. వైద్య విద్యార్థి ఆర్ధిక ఇబ్బందులను తెలుసుకున్న హంస ఫౌండేషన్ చైర్పర్సన్ చెరుకు లక్ష్మీ, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ లు మానవతా దృక్పథంతో అతని చదువు కోసం రూ.15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కరోనాతో అప్జల్ భార్య గత ఏడాది మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వగ్రామంలో ఇక ముందు తమ కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వరికుప్పల రాందాస్, ఊడుగు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!