శ్రీ హనుమాన్ జంక్షన్లో హనుమాన్ దీక్ష రజతోత్సవ వేడుకలు
వెల్దుర్తిలో శ్రీ హనుమాన్ జంక్షన్లో హనుమాన్ దీక్ష రజతోత్సవ వేడుకలు
వెల్దుర్తి, నవంబర్ 19, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు బెంగళూరు జాతీయ రహదారి వెల్దుర్తి కూడలి నందు వెలసిన 51 అడుగుల వీరహనుమాన్ విగ్రహం వద్ద హనుమాన్ దీక్ష గురు స్వామి శ్రీరామాంజనేయులు ఆధ్వర్యంలో రజితోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణము, లోకకళ్యాణార్ధం విశేష శాంతి హోమం, అన్నమాచార్య సంకీర్తనలు, హనుమద్వ్రతం, సువర్చలాసమేత శ్రీ హనుమాన్ విశేషార్చనలు, హనుమాన్ శోభాయాత్ర జరిగినది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విశ్వహిదూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణలో విశేషంగా కృషి చేస్తున్న విశ్వహిందూ పరిషత్ లో హిందువులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్య వక్తగా హాజరైన విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు మాట్లాడుతూ ధర్మరక్షణలో ప్రతి హిందువు హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి.నాయకులు కంగాటి రామ్మోహన్ రెడ్డి, కంగాటి ప్రదీప్ రెడ్డి, కంగాటి శివారెడ్డి, కంగాటి వంశీ రెడ్డి, కొల్లూరు రాధాకృష్ణ మూర్తి, కె.ఇంద్రావతమ్మ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సత్సంగ భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఎనిమిదవ తరం వారసులు శ్రీ వీరంభట్లయ్య స్వామి, శ్రీ సద్గురు నాగలింగేశ్వర శివాచార్య శివ జీవైక్యమఠం పీఠాధిపతులు శ్రీ యల్లప్ప స్వామి, శ్రీ లలితా పీఠం పీఠాధిపతులు శ్రీగురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, కె.వి.సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత కె.వి. సుబ్బారెడ్డి, కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు రామాంజనేయులు, జి.ప్రసాద్, త్యాగరాజు, శ్రీ గోడల హనుమంతరాయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, శేషయ్య, కోరమాండల్ సిమెంటు మేనేజర్ ఎ.రాజేశ్వర్ రెడ్డి, శ్రీభీమలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు పూడూరు నాగేశ్వరమ్మ లక్ష్మిరెడ్డి, శ్రీకామధేను గోశాల వ్యవస్థాపక అధ్యక్షులు బి. శ్రీరాములు, వైద్యం గిడ్డయ్య సాహితీసేవ సమితి అధ్యక్షులు వైద్యం రామానాయుడు, డాక్టర్ రఘునాథ రెడ్డి, బాలస్వామి, చంద్రాస్వామితో పాటు, చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, హనుమాన్ దీక్ష స్వాములు, అయ్యప్ప దీక్షా స్వాములు, పాల్గొన్నారు. భక్తులందరికీ మహా ప్రసాద వితరణ చేశారు.