అవగాహనతో ఆర్థిక నేరాలను అరికట్టవచ్చు
జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
కర్నూలు క్రైమ్, నవంబర్ 16, (సీమకిరణం న్యూస్) :
కెనరా బ్యాంకు ఆధ్వర్యం లో కర్నూలు పట్టణంలోని ఎస్ వి కాంప్లెక్సు దగ్గర ఉన్న బి.ఎ.యస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం కు ముఖ్య అతిగా హాజరయిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు ఏవరైనా ఆన్ లైన్ మోసాల బారిన పడినట్లయితే కంగారుపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలన్నారు. లేదా వెబ్ సైట్ https:// www.cybercrime.gov.in అనే పోర్టల్ లో ఫిర్యాదులు నమోదు చేయాలన్నారు. మోసపోయిన బ్యాంకు ఖాతాదారులు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి జాగ్రత్త పడాలన్నారు. వెంటనే ఫిర్యాదు చేయడం వలన బాధితుల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన నగదు ను 90 శాతం వరకు సైబర్ నేరాల ఖాతాలకు బదిలీ కాకుండా చేయవచ్చన్నారు. 1930 కి ఫిర్యాదు చేయకుండా ఆలస్యం చేస్తే చర్యలు తీసుకునే లోపే వేరే వేరే సైబర్ నేరగాళ్ళ ఖాతాలకు నగదు బదిలీలు జరుగుతాయన్నారు. UPI, Google pay, Phone pay, QR code Scan వంటి ఆర్ధిక విషయాలలో నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. వ్యక్తిగత మొబైల్ ఫోన్ , కంప్యూటర్ పరికరాలను తెలియని వారికి ఇచ్చి మోసపోవద్దన్నారు. ముందుజాగ్రత్తలే ముఖ్యమన్నారు. డిటెక్షన్, రికవరీ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నదన్నారు. లాటరీ తగిలిందని, పర్సంటేజిలలో చిట్ ఫండ్ ల ఆదాయాలు వస్తాయని చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ నేర గాళ్ళ చేతిలో మోసపోతున్నారన్నారు. ఎటిఎం ల దగ్గర కార్డులు మార్చి నకిలీ కార్డులు ఇచ్చి మోసాలు జరుగుతున్నాయన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో లాటారీ ఫ్రాడ్స్ పేరిట ఎంతో మంది మోసపోతున్నారన్నారు. పేక్ లోన్ యాప్స్ , తెలియని లింకులు క్లిక్ చేయడం వంటివి చేయరాదని ప్రజలు అప్రత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన, ముందు జాగ్రత్తలే కీలకమన్నారు. ఒక వేళ ఏవరైనా సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయారని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయండి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన, ముందు జాగ్రత్తలే కీలకం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటనారాయణ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ సమగ్ర అవగాహన దినోత్సవం నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు జిల్లా మొత్తంగా గ్రామాల వారీగా మండల వారీగా బ్లాక్ లెవెల్ లో ఖాతా బ్యాంకు ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై మరియు సైబర్ క్రైమ్ ల పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కెనరా బ్యాంక్ కర్నూల్ రీజియన్ ఏజిఎం వీరేంద్రబాబు మాట్లాడుతూ నవంబర్ 1 వ తేది నుండి 30 తేది వరకు రిజర్వు బ్యాంకు – ఇంటిగ్రేటేడ్ అంబుడ్స్ మన్ స్కీమ్ , 2021 అంతర్గత ఫిర్యాదుల పరిష్కారం విధానం, సురక్షిత బ్యాంకింగ్ పద్దతుల గురించి ఈ జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమంలో తెలియజేస్తున్నామన్నారు.బ్యాంకులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు ఖాతాదారులు ఎవరికి షేర్ చేయవద్దన్నారు. ఎస్ బి ఐ రీజనల్ మేనేజర్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ డిజిటల్ మోసాలు చాలా జరుగుతున్నాయని వీటిని ఆపలేమన్నారు. పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేస్తామని, కేవైసీలు అప్డేట్ చేస్తామని, బ్యాంకు మేనేజర్ అని చెప్పి కాల్ చేసి, సామాజిక మాధ్యమాలలో మనకు తెలిసిన వ్యక్తుల్లా నటిస్తూ ఫేస్బుక్ ఐ డి ల పేర్లు మార్చి మోసాలు, కోవిడ్ పరీక్షలు, సంక్షేమ పథకాలు, డిస్కాంట్ల ఇస్తామని, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అని చాలా రకాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట నారాయణ, కెనరా బ్యాంక్ ఏజిఎం వీరేంద్రబాబు , ఎస్ బి ఐ ఏజిఎం సూర్య ప్రకాష్ , యూనియన్ బ్యాంకు రీజినల్ ఇంచార్జ్ మూర్తి, పి.డి మెప్మా వెంకటలక్ష్మీ, కర్నూలు టు టౌన్ సిఐ శ్రీనివాసులు , సైబర్ ల్యాబ్ ఎస్సై వేణుగోపాల్, జిల్లాలోని జాతీయ, ప్రవేట్ బ్యాంకు ల అధికారులు , బ్యాంకుల ఖాతా దారులు , మహిళలు పాల్గొన్నారు.