30 రోజుల గడువు లోపల సమాచారం ఇవ్వండి
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ కాకర్ల చెన్నారెడ్డి
కర్నూలు కలెక్టరేట్, నవంబర్ 17, (సీమకిరణం న్యూస్):
30 రోజుల గడువు లోపల సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ కాకర్ల చెన్నారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన కేసులు/అప్పీల్ హియరింగ్ కార్యక్రమాన్ని మరియు స్థానిక మున్సఫ్ కోర్టు, డిఎస్పీ ఆఫీస్, జిల్లా పంచాయతీ, బిసి వెల్ఫేర్ మరియు ఆర్టీఓ కార్యాలయాల్లో అమలు చేస్తున్న సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వారికి హియరింగ్ నోటీసులు ఇచ్చిన హాజరు కాకుంటే 8(1)(G) కింద రిజెక్ట్ చేయండి. సమాచార హక్కు చట్టం కింద ఏ అప్లికేషన్ వచ్చిన 30 రోజుల గడువు లోపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అప్పిలేట్ అధికారులను, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులను ఆదేశించారు. అప్లికేంట్స్ అడిగిన సమాచారం మరియు పిఐఓ/అప్పిలేట్ అధికారులు ఇచ్చిన సమాచారం సరిగా ఉన్నాయ లేదా అని వెరిఫై చేశారు. కొంతమంది సమాచారాన్ని గడువు దాటిన తర్వాత పంపిస్తున్నారని అలా కాకుండా గడువు లోపు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ రోజు 19 కేసులు హియరింగ్ కి రాగ 15 కేసులు డిస్పోస్ చేశామని ముఖ్యంగా కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్, సర్వ శిక్ష అభియాన్ మరియు జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. అలాగే సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి వచ్చిన దరఖాస్తులకు ఎన్ని రోజులలో సమాధానం ఇస్తూ రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నారు రిజిస్టర్ పోస్ట్ అయితే పోస్టల్ రిసీప్ట్ కూడ డిస్పాచ్ రిజిస్టర్ లో ఎంట్రీ చేయండి అని అన్నారు. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన దరఖాస్తులు రాగానే వెంటనే రిజిస్టర్ లో ఎంట్రీ చేయండి. ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు వారి ఆన్లైన్ వెబ్సైట్ లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన 4(1)(బి) అప్లోడ్ చేశార లేదా ఒకవేళ అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సఫ్ కోర్టు, డిఎస్పీ ఆఫీస్, జిల్లా పంచాయతీ, బిసి వెల్ఫేర్ మరియు ఆర్టీఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు.