సమాచార హక్కు చట్టం మీద జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించండి
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ కాకర్ల చెన్నారెడ్డి
కర్నూలు కలెక్టరేట్, నవంబర్18, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శుక్రవారం సమాచార హక్కు చట్టం దినముగా ప్రకటించినందున, ప్రతి నెల మూడవ శుక్రవారం సమాచార హక్కు చట్టం మీద జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు గారితో కలిసి సమాచార హక్కు చట్టం పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ కాకర్ల చెన్నారెడ్డి నిర్వహించారు.. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార హక్కు కమీషనర్ కాకర్ల చెన్నారెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన కేసులు పరిష్కరించడానికి జిల్లాలో మూడు రోజుల పాటు క్యాంప్ కోర్టు ఏర్పాటు చేసి, చాలా కేసులు కూడ డిస్పోజ్ చేశామని అన్నారు. అదే విధంగా కార్యాలయాలలో ఏ విధంగా సమాచార హక్కు చట్టాని అమలు చేస్తున్నారు, దరఖాస్తులను గడువు లోపు పంపిస్తున్నార లేదా, రిజిస్టర్లు ఏ విధంగా మైంటైన్ చేస్తున్నారో అని తెలుసుకోవడానికి చాలా కార్యాలయాలను కూడ తనిఖీ చేయడం జరిగిందని అన్నారు.. ఆ సమయంలో గమనించింది ఏంటంటే చాలా మంది 30 రోజుల గడువు లోపల సమాచారం ఇవ్వడం లేదు అలా కాకుండా ప్రతి ఒక్కరూ గడువు లోపల సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, రిజిస్టర్ పోస్ట్ చేసినపుడు పోస్టల్ రిసిప్ట్ డిస్పాచ్ రిజిస్టర్ లో భద్రపరచాలని అధికారులను ఆదేశించారు.. జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి నెలలో మూడవ శుక్రవారం అధికారులతో సమాచార హక్కు చట్టం మీద సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు.జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ ప్రజలకు అత్యంత ఉపయోగపడే చట్టాలల్లో సమాచార హక్కు చట్టం ఒక్కటి అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. గత రెండు రోజులు నుండి చాలా కార్యాలయలలో అమలు చేస్తున్న సమాచార హక్కు చట్టం విధానాన్ని కమీషనర్ సందర్శించడం జరిగిందని అందులో భాగంగా ఉన్న లోటుపాట్లు కూడ తెలియచేశారని, ఆ లోటుపాట్లు అని కూడ సరిచేసుకోవాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ప్రతి నెల మూడవ శుక్రవారం సమాచార హక్కు చట్టం మీద జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేలా మరియు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్లు ఎన్.మనోజ్ రెడ్డి, జి.వి.రమణ కాంత్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గడువు దాటకముందే సమాచారం పంపించండి
గడువు దాటకముందే సమాచారం పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని అప్పిలేట్/పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులను సమాచార హక్కు చట్టం కమీషనర్ కాకర్ల చెన్నారెడ్డి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గోకులం సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన కేసులు/అప్పీల్ హియరింగ్ కార్యక్రమాన్న రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ కాకర్ల చెన్నారెడ్డి నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కమీషనర్ కాకర్ల చెన్నారెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వారికి గడువు దాటిన తర్వాత సమాధానం పంపిస్తున్నారని అలా కాకుండా గడువు లోపల పంపించాలని అన్నారు. కార్యాలయ పనులలో ఉన్న కూడ ఒక్క రోజు కేటాయించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వారికి సమాధానం ఇచ్చే విధంగా చూడాలన్నారు. ఈరోజు 9 కేసులు హియరింగ్ కు రాగ 8 కేసులు డిస్పోజ్ చేశామని వాటికి సంబంధించి రెవెన్యూ, సర్వే, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మరియు పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.