ఎల్. బండ గ్రామంలోదుర్గంధంలో ఎస్సీ కాలనీ…
దుర్గంధంలో ఎస్సీ కాలనీ…
పట్టించుకోని అధికారులు..
ఇబ్బందుల్లో ప్రజలు
వెల్దుర్తి, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్. బండ గ్రామంలో రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. కాలనీవాసులు దుర్గంధంలో జీవనం సాగిస్తున్నారు. పట్టించుకోని సంబంధిత అధికారులు. ఏళ్ల తరబడి కాలనీవాసులపై కన్నెత్తి చూడని అధికారులు. ఎక్కడపడితే అక్కడ నీరు రోడ్లపై ప్రవహించడంతో ముసలి ముతక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లకు ఇరువైపులా మురికి కాలువలు లేకపోవడంతో కాలనీవాసులు రోడ్లపైనే నీరు పారవేస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నేరెట్టినట్లుగా వ్యవహరించడం సరికాదని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. సంబంధిత అధికారులు ఎల్ . బండ గ్రామం లోకి వచ్చి రోడ్లు మురికి కాలువలపై తగు విచారణ జరిపి కాలనీవాసులకు సిసి రోడ్లు మురికి కాలువలు వేసి గ్రామ కాలనీవాసులకు ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.