సీమకిరణం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కర్నూలు జిల్లా ఎస్పీ
నేటి సమాజంలో పత్రికా రంగం కీలకం
-: ఎక్కడ చిన్న సమస్య జరిగిన ముందుండేది జర్నలిస్టులే
కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
కర్నూలు క్రైమ్ , జనవరి 06, (సీమకిరణం న్యూస్) :
నేటి సమాజంలో ఏమారు మూల ప్రాంతంలో అయినా సరే ఏ సమస్య జరిగిన క్షణాల్లో యావత్ ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపించేది మీడియా నే అని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం సీమకిరణం దినపత్రిక కు సంబంధించిన క్యాలెండర్ ను ఎస్పీ కార్యాలయంలో ఎడిటర్ నజీర్అహ్మద్ బాష , అంకురం ఎడిటర్ మస్తాన్ వలీ , బ్యూరో కె. జె. బాబు లతో కలిసి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ సమస్యను గుర్తిస్తూ, వాటికి సంబంధించిన ఫోటోతో కూడిన కథనాలు ప్రచురించడం ద్వారా సంబంధిత అధికారులకు సమాచారం చేరడంతో సమస్యకు త్వరితగతిన పరిష్కరించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.
ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా జర్నలిస్టులు నిలవడం హర్షించ దగ్గ విషయ మన్నారు. సీమకిరణం దినపత్రిక దిన దినాభివృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ ఆకాంక్షించారు.