భక్తులతో మారు మ్రోగిన శివనామ స్వరాలు
వెల్దుర్తి, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
వెల్దుర్తి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వెలసిన కామేశ్వర సైతాబ్రహ్మేశ్వర స్వామి ఆలయమునందు సోమవారం భక్తులతో శివనామ స్వరాలతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ సిబ్బంది సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోమవారం కార్తిక కడ సోమవారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కోనేరు నందు నీరు పుష్కలంగా ఉండడంతో భక్తులు స్నానాలు ఆచరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఆలయ ఈవో హనుమంతరావు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వెల్దుర్తి సీఐ యుగంధర్ ఆదేశాల మేరకు ఎస్సై రామమోహన్ రెడ్డి సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.