
వైభవంగా మహబూబ్ సుభాని గందోత్సవం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామంలోని ముస్లింల పవిత్రమైన గార్మి నెల సందర్భంగా మహబూబ్ సుభాని జెండా చెట్టు దర్గా లో ఆదివారం రాత్రికి గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహబూబ్ సుభాని జండా చెట్టు వద్ద ప్రతి ఏడాది లా ఈ ఏడాది కూడా భక్తుల కోరికలు నెరవేరే వరఫల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.. మొదట దర్గా వద్ద రాజవోలు గ్రామ మసీద్ ముజావర్ చేత ప్రత్యేక ఫాతిహా ప్రార్ధన నిర్వహించి అనంతరం భక్తులకు వరఫలం అందించారు.. నియమనిష్టతో భక్తిపార్వశంగా తమ కోరికలు నెరవేరాలని ఉద్దేశంతో భక్తులు ఈ వరఫలాలను అందుకున్నారు. అనంతరం దర్గా వద్ద దర్గా నిర్వాహకులు భక్తులందరికీ భారీ అన్నదానం నిర్వహించారు.. ఫకీరుల వాయిద్యా విన్యాసాలు నిర్వహించారు. మహబూబ్ సుభాని జండా చెట్టు దర్గా లో గంధము ఎక్కించి అనంతరం భక్తులకు గంధ ప్రసాదాలు పంచిపెట్టారు ఈ గంధమహోత్సవ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, ముస్లిం యూత్, పిల్లలతో పాటు కులమతాలకు అతీతంగా గ్రామంలో అందరూ పాల్గొన్నారు. గంధ మహోత్సవానికి వచ్చిన భక్తులకు ఇక్కడి మహబూబ్ సుభాని దర్గా కమిటీ సభ్యులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు.