
ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
నెల్లూరు, ఆత్మకూరు, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు పట్టణానికి చెందిన “చల్లా వెంకమ్మ” మొదటి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణ సమీపంలోని వెంకట్రావుపల్లి గిరిజనకాలనీలో నివాసముంటున్న గిరిజనులకు “ఐక్యఫౌండేషన్” ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈకార్యక్రమంలో కె.వి శేషారెడ్డి మాట్లాడుతూ వెంకమ్మ జ్ఞాపకార్థంగా ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు..అనంతరం ఐక్యఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతినాయుడు మాట్లాడుతూ వెంకమ్మ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారని “అన్నిదానాలకన్నా అన్నదానం గొప్పదని” ఈ కార్యక్రమంలో సుమారు 130మందికి పైగా భోజనం అందజేసామని అన్నారు.
ఈకార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి,పెంచలయ్య,కార్తీక్, లోకేష్,ప్రకాశం,ఖాజామస్తాన్ తదితరులు పాల్గొన్నారు.