పేద మహిళలకు చీరలు క్యాలెండర్ల పంపిణీ
నెల్లూరు, ఆత్మకూరు, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
బుచ్చి రెడ్డిపాలెం మండలం నూ రామచంద్రపురం, రాయలసీమ తిప్ప కాలనీ గ్రామాలలో మహిమా వర్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమం జరిగింది. న్యూ రామచంద్రపురం,రాయలసీమ తిప్పకాలనీ ,పోలినాయుడు చెరువు,పల్లాపల్లి, గాంధీ జన సంఘం గ్రామాలలో200 మంది పేద మహిళలు ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు త్వరలో రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పేద మహిళలకు ఈఎంసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేశారు 2023 వ సంవత్సరము క్యాలెండర్ ను 200 మందికి పంపిణీ చేశారు ఈ సందర్భంగాఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ ఆత్మకూరు కార్యదర్శి పి శిరీష ఎడ్వర్డ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా అనేక మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ ఉన్నామనీ ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ ఇస్సాక్, జాషువా డానియల్, భాస్కర్, బ్రదర్ రఘు పాల్గొన్నట్లు ఈఎంసి ఫౌండేషన్ ఆత్మకూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ ముఖ్య నిర్వాహకులు పి.ఎడ్వర్డ్ తెలిపారు..