
ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
తహసిల్దార్, ఎంపీడీవో
నెల్లూరు, ఆత్మకూరు, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2021-22 కింద ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆత్మకూరు తాసిల్దార్ పి.లక్ష్మీ నరసింహ, ఎంపీడీఓ సి.శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం పిఎంజివై – వైయస్సార్ గ్రామీణ లబ్ధిదారుల అవగాహన సదస్సు మరియు గ్రౌండింగ్ ను చెర్లోయడవల్లి గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా తాసిల్దార్,ఎంపీడీవో లు మాట్లాడుతూ మండలంలో 148 గృహాలు ఈ పథకం క్రింద మంజూరు అయ్యాయని. అందరూ లబ్ధదారులు దశల వారీగా పూర్తి చేయాలని వారు తెలిపారు. అనంతరం తహసిల్దారు లక్ష్మీనరసింహం తో కలసి ఎంపీడీవో శ్రీనివాసులు లబ్ధిదారులకు గృహ హక్కు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ఎం.వివేక్, వర్క్ ఇన్స్పెక్టర్ శరత్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏడుకొండలు, పంచాయతీ కార్యదర్శ శాంతి సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు