
ఆటలతోనే ఆరోగ్యం సాధ్యం
బిజెపి రాష్ట్ర సభ్యురాలు డాక్టర్ వినుషా రెడ్డి
కర్నూలు స్పోర్ట్స్, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్):
విద్యార్థులు క్రమం తప్పకుండా ఆటల్లో సాధన చేస్తే మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఫిజీషియన్ డాక్టర్ వినుషా రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా నెట్ బాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినీషా రెడ్డి మాట్లాడుతూ క్రీడారంగంలో బాలికలు, మహిళలు అంతర్జాతీయ వేదికలపై పథకాలు సాధిస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం శుభపరిణామం అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నాగేశ్వర బాబు మాట్లాడుతూ పీ.వీ సింధు,సైనా నెహ్వాల్ వంటి నేటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు క్రీడారంగంలో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నెట్ బల్ సంఘం కార్యదర్శి వంశీ కృష్ణ, న్యాయము ఉపాధ్యాయులు గీతా, సుప్రియ,సుమలత,సరళ తదితరులు పాల్గొన్నారు.