సమాచార హక్కు చట్టంపై అవగాహన తప్పనిసరి
-: లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్
కర్నూలు కలెక్టరేట్, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టంపై అవగాహన తప్పని సరని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ అభిప్రాయపడ్డారు. సమాచార హక్కు చట్టం సంబంధించిన కరపత్రాలను సోమవారం
కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజా సంఘాల నాయకులు జయన్న, ధనుంజయాచారి రాము నాయక్, శంకర్ నాయక్,
రామాంజనేయలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో అమలు చేసిన సమాచార హక్కు చట్టంపై నేటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 90% పైగా ప్రజలకు నేటికీ ఈ చట్టంపై అవగాహన లేపకపోవడం బాధాకరమన్నారు. పాలక ప్రభుత్వాలు ఈ చట్టం గురించి విస్తృతంగా ప్రచారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని
ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ఆవశ్యకతను వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సామాన్యులు ఏదైనా అనుమానం వస్తే ఆ అంశానికి సంబంధించిన సమాచార హక్కు పత్రం ద్వారా సంబంధిత అధికారికి అందిస్తే నిర్ణీత గడువులోగా పూర్తి సమాచారం సదరు అధికారి ఇవ్వాల్సి ఉంటుందన్నారు.