సీమకిరణం దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్
కర్నూలు టౌన్, జనవరి 07, (సీమకిరణం న్యూస్ ) :
నిత్యం ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేసే పత్రిక సీమకిరణం దినపత్రిక అని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం వైకాపా నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రిక సంపాదకులు నజీర్ అహ్మద్ భాష తో కలిసి కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ సీమకిరణం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అక్షరం ప్రజల కోసమే పోరాడుతూ, అన్ని తరగతుల ప్రజల మన్ననలను అందుకోవడం అభినందనీయం అన్నారు. అనంతరం వైకాపా నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పని చేస్తూ ప్రజా గొంతుకగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీమ కిరణం తెలుగు దినపత్రిక సంపాదకులు నజీర్ అహ్మద్ భాష గోవిందు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు