
55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
పత్తికొండ, నవంబర్ 21, (సీమకిరణంన్యూస్ ) :
పత్తికొండ 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశాన్ని పత్తికొండ గ్రంథాలయ శాఖ అధికారి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు . మన్రో పేట బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాశీం సాహెబ్ , ఉపాధ్యాయులు రామ్మోహన్ రెడ్డి , రామ్ కుమార్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు మాట్లాడుతూ గ్రంథాలయాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని , జ్ఞానాన్ని సంపాదించుకోవాలని , విజ్ఞానంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని జరిపిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.తెలియజేశారు