
జ్యోతిరావు గోవింద రావు పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన కర్నూలు యువనాయకులు
కర్నూలు టౌన్, నవంబర్ 28, (సీమకిరణం న్యూస్) :
సమాజంలో కులవ్యవస్థ నిర్మూలన, స్త్రీ, పురుషులకు సమాన హక్కు, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా వారి విద్యాభివృద్ధి మరియు సామాజిక అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, మహనీయుడు “మహాత్మా జ్యోతిరావు గోవింద రావు పూలే” గారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ కర్నూలు యువనాయకులు నౌషాద్ నగరంలోని విద్యుత్ కార్యాలయం లోని జ్యోతీరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నౌషాద్ గారు మాట్లాడుతూ మానవ జీవితంలో విద్య చాలా ముఖ్యమైనది అందులో మహిళలు చదువుకుంటే కుటుంబంతో పాటు దేశం బాగుపడ్తుంది అని నామిన మహానుభావుడు జ్యోతిరావు గోవిందరావు పూలే గారిని సదా స్మరించుకొంటూ, ఆ మహనీయుని ఆశయాల సాధనకై కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని” అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహ రెడ్డి నగర్ యూత్ సభ్యులు,నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం కర్నూల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజకుమార్,శ్రీకాంత్ ఈశ్వర్,రంగా,సూరీ,నవీన్,భాస్కర్ పాల్గొన్నారు.