ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం
పేదింటి బిడ్డకు ప్రాణ బిక్ష పెట్టిన ముఖ్యమంత్రి
బాలుడు చికిత్స కోసం 11లక్షలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రతి ప్రాణము ముఖ్యమే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్
హోళగుంద, నవంబర్ 28,(సీమకిరణం న్యూస్ ) :
ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హాలహర్వి మండలంలోని చింతకుంటా గ్రామంలో ఉప్పర రవి సన్నాఫ్ శ్రీనివాసులు అనే చిన్నారికి అప్లాస్టిక్ అనిమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు.చికిత్స చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కుంటుంబం చాలా నిరుపేద కుటుంబం కావడంతో చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో వారి ఆవేదన వర్ణనాతీతం. నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టండని వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చికిత్స కోసం రూ.14 లక్షల రూపాయల ఖర్చు అవుతోందని వైద్యులు వెల్లడించారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి గురించి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన బాలుడి చికిత్స కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బాలుడి చికిత్స కోసం రూ. 11 లక్షల రూపాయల మంజూరు చేశారు. అందుకు సంబంధించిన పత్రాన్ని మంత్రి జయరాం ఆదివారం బాలుడు,తల్లిదండ్రులకు ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అందించారు.ఈ సందర్భంగా ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం సహాయ నిధి ద్వారా తమకు అందించిన ఆర్దిక సహాయానికి బాధిత కుటుంబాలు మంత్రి గుమ్మనూరు జయరాం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ అర్ధగేరి శ్రీనివాసులు,నాయకులు వెంకటేష్,రాముడు,రంగనాధ్, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..