
కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 11, (సీమకిరణం న్యూస్) :
ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కమిటీ డైరీని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల కోసం, సమస్యల కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, జర్నలిస్టులపై దాడులు జరిగినా వెంటనే స్పందించి ముందుండి పోరాడుతుండడం హర్షించదగ్గ విషయం అన్నారు. భవిష్యత్ లో కూడా జర్నలిస్టుల హక్కుల కోసం, వారి సమస్యల కోసం ముందుండి పోరాడాలని సూచించారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తన వంతు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ఈ సంద్భర్భంగా డైరీ నీ పరిశీలించారు. రాష్ట్ర సమగ్ర సమాచారంతో డైరీని రూపకల్పన చేశారని, జర్నలిస్టులకు ఈ డైరీ చాలా ఉపయోగంగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు సుబ్బయ్య, జిల్లా అధ్యక్షులు ఈ.ఎన్. రాజు, జిల్లా సహాయ కార్యదర్శులు అవినాష్, శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, మధు తదితరులు పాల్గొన్నారు.