వైసిపిపై ఆరోపణలు నిరాధారమైనవి
జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ నియాజ్ అహ్మద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహబూబ్ బాష
ఆదోని ప్రతినిధి, ఫిబ్రవరి 10, (సీమకిరణం న్యూస్):
వైసిపి ప్రభుత్వంపై ముస్లీం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ నియాజ్ అహ్మద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహబూబ్ బాష ఖండించారు. శుక్రవారం స్థానిక వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో తెలుగుదేశం కోవర్టుగా పనిచేస్తున్న ముస్లీం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముస్లింల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ముస్లీంలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఆయన తనయుడు వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ముస్లింలకు డిప్యూటీ సీఎం, మేయర్లతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అనేక పదవులు ఇచ్చి ముస్లింలకు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు బి దేవా, స్టేట్ డైరెక్టర్ మటన్ మస్తాన్, అహ్మద్ బాష, ఆర్టీసీ రహెమాన్, అల్తాఫ్ పాల్గొన్నారు.