లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్
కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
ఈ నెల 11న నేషనల్ మెగా లోక్ అదాలత్
కర్నూలు క్రైమ్, ఫిబ్రవరి 08, (సీమకిరణం న్యూస్) :
కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ తెలిపారు.
ఫిబ్రవరి 11 వ తేదిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో భాగంగా కర్నూలు నగరంలోని కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. లోక్ అదాలత్ లో భాగంగా పోలీసుస్టేషన్ కు వచ్చిన కక్షిదారులు, ఇరుపక్షాల వారికి జిల్లా ఎస్పీ కౌన్సిలింగ్ చేశారు. ఫిబ్రవరి 11 న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం గురించి జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ లలో సత్వర న్యాయ మేళా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. పెండింగ్ కేసులలోని కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇరు పక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. నోటీసులు అందిన కక్షిదారులు వారి కేసులను లోక్అదాలత్లో రాజీద్వారా పరిష్కరించుకొనేందుకు ముందుకు రావాలన్నారు. కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం తగ్గుతుందని, డబ్బు ఆదా అవుతుందని, కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న చిన్న విషయాలకు ఘర్షణలతో పెండింగ్ కేసులు పేరుకు పోయాయని, రాజీ అయి కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా చూడాలని, రాజీ అయ్యే వారికి కౌన్సిలింగ్ చేసి పెండింగ్ లో ఉన్న కేసులను తగ్గించాలని పోలీసు అధికారులకు ఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ గారి వెంట డిఎస్పీ యుగంధర్ బాబు, కర్నూలు నాల్గవ పట్టణ సిఐ శంకరయ్య , ఎస్సైలు ఉన్నారు