ఉరుసు మహోత్సవానికి ముస్తాబైన సద్గురు శ్రీశ్రీశ్రీ మహాత్మా బడేసాబ్ స్వాములవారు
హిందు ముస్లిం సాంప్రదాయంగా విరాజిల్లుతున్న ఏకైక సద్గురు బడేసాహెబ్ స్వామి వారి దర్గా
గోనెగండ్ల , ఫిబ్రవరి 23 , ( సీమకిరణం న్యూస్ ) :
కులమతాలకు అతీతంగా భక్తుల గుండెల్లో మహిమాన్వితుడుగా విరాజిల్లుతున్న గంజహళ్లి బడేసాహెబ్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండల పరిదిలోని గంజహళ్లి గ్రామంలో వెలసిన దర్గా ఎంతో ప్రసిద్ధిగాంచింది . ప్రతి ఏటా జరిగే స్వామి వారి ఉత్సవాలకు జిల్లాలోనే కాక , తెలంగాణ , తమిళనాడు , మహారాష్ట్ర , కర్నాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు . ఈ సమయంలో గంజిహళ్లి గ్రామంలో ఇసుక వేస్తే రాలదన్నట్లు భక్తులు తరలివస్తారు .
329వ ఉరుసు మహోత్సవం స్వామి వారి 2023 ఫిబ్రవరి గంధం 25, ఉరుసు 26, జియారత్ 27 మహోత్సవం జరుగును ఈ మహోత్సవానికి భక్తాదులు వచ్చి కృపాత్రులు కాగలరు.
స్వామి చరిత్ర :
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలుకా పొదల కందకూరు గ్రామానికి చెందిన బీయమ్మ , జిందేసాహెబ్ కుమారుడు మహాత్మ బడేసాహెబ్ . పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందని అన్న చందంగా బడేసాహెబ్ చిన్ననాటి నుండే ఆధ్యాత్మికను వంట పట్టించుకున్నాడు మహిమలు చూపుతూ గంజహళ్లి గ్రామానికి చేరుకున్నాడు . ఈ గ్రామంలో అనేక మహిమలు చూపడమేకాక ప్రజల కష్టాలు తీర్చి మహిమాన్వితుడిగా పేరుగాంచాడు . ఆ రోజుల్లో తాను ఉన్న చోటి నుంచే ప్రముఖ పుణ్యక్షేత్రాలను భక్తులకు చూపించే వారని , ఎన్నో మహిమలు చూపించి భక్తులను మైమరిపించేవారని అక్కడే ఉంటూ 1894 సంవత్సరంలో స్వామివారు జీవసమాధి కావటంతో ఆనాటి నుండి గ్రామస్తులు స్వామివారిని కొలుస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు . అంతేగాక స్వామి మహిళలను గుర్తించిన భక్తులు తమకు ఉన్న వ్యాదులు , ఇతర సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటూ దర్గా వద్ద రోజుల తరబడి నిద్రలు చేస్తూ స్వామివారిని సేవిస్తుంటారు .స్వామి వారి గురువు అయినటువంటి తిమ్మగురుని స్వామి వారిని మొదటి పూజ జరిగిన తరువాత స్వాముల వారి ఉరుసు మహోత్సవం జరుగుతుంది. తెలంగాణ గద్వాల జిల్లా లో వెలసిన తిమ్మగురుడు స్వామి గద్వాల పున్నమికి గంజిహళ్లి నుండి ఉరులో ఉన్న ప్రజల 100లాది గా తరలి వెళ్లి మొదటి పూజ బడేసాబ్ తాత స్వాములవారు గురువుకు జరిగిన తరువాత మహా శివరాత్రి అమావాస్య తరువాత 7రోజులకు స్వామివారి ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి వంశీకులు వారి ఇళ్ళలో పెళ్లిళ్లు జరగాలంటే బడేసాబ్ తాత గురువైనటువంటి తిమ్మగురుని స్వామిని పూజ చేసిన తరువాతనే పెళ్లిళ్లు చేసుకోవటం ఆనవాయితీగా తెలుస్తుంది
ఇక్కడ పాలు అమ్మరు …. కొనరు :
గంజహళ్లి గ్రామంలో బడేసాహెబ్ స్వామి ఆజ్ఞ ప్రకారం పాలు అమ్మరు , కొనరు . అంతేగాకుండా గ్రామ శివారులో ఆవును వధించరు . ఆవును వధిస్తే వారికి కుష్టువ్యాధి రావడమేగాక వారి జాతి అంతరించిపోతుందని తరాలుగా వస్తున్న ఆచారం . ప్రతి గురువారం అన్నదానం : ఇక్కడకి వచ్చె వందలాది భక్తులకు ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం చేపడతారు . అలాగే ప్రతి అమవాస్య రోజున భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు .
ప్రత్యేక ఏర్పాట్లు :
: – ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే ఉరుసును పురష్కరించుకుని దర్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ చిన్న ముద్దుగోల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు . తాగునీటి వసతి , చలువ పందిళ్లు ఏర్పాట్లు చేస్తారు . దర్గాను రంగులతో అందంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు . ఎమ్మిగనూరు ఆర్టీసీ డీపో భక్తులు కోసం ప్రత్యేక బస్సులను నడుపుతుంది . గోనెగండ్ల పోలీసులు ఉరుసును . పురష్కరించుకుని గట్టి బందోబస్తు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవటంతోపాటు ఉరుసుకు వచ్చే మహామహాలు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి , కెఇ , కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం , మాజీ ఎంపి బుట్టారేణుకా, మాజీ ఎంఎల్ఎ బివి . జయనాగేశ్వరరెడ్డి, తదితర నాయకులు దర్గాను సందర్శించుకుని పూజలు చేసుకునేందుకు బందోబస్తు చేస్తారు