సీమకిరణం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి
కర్నూలు టౌన్, జనవరి 08, (సీమకిరణం న్యూస్) :
స్థానిక గిప్సన్ కాలనీ లోని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి స్వగృహంలో శనివారం సీమకిరణం దినపత్రిక ఎడిటర్ నజీర్ అహ్మద్ , అంకురం ఎడిటర్ మస్తాన్ వలి, బ్యూరో ఇంచార్జ్ కే. జె. బాబు తో కలిసి సీమకిరణం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మరియు ఆయన సతీమణి ఎస్వి విజయ మనోహరి తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషిచేసే పత్రిక సీమకిరణం దినపత్రిక అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి అక్షరం ప్రజల కోసమే పోరాడుతూ, అన్ని తరగతుల ప్రజల మన్ననలను అందుకోవడం అభినందనీయం అన్నారు