సీమ ప్రజల గుండె చప్పడు సీమకిరణం
హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ న్యాయ వాదుల ఫోరమ్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది వై.జయరాజు
కర్నూలు టౌన్, జనవరి 10, (సీమకిరణం న్యూస్) :
సీమ ప్రజల గుండె చప్పడు సీమ కిరణం అని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ న్యాయ వాదుల ఫోరమ్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది వై.జయరాజు అన్నారు. ఆదివారం సీమకిరణం పత్రికా సంపాదకులు నజీర్ అహ్మద్, రిపోర్టర్లతో కలిసి జయరాజు చేతుల మీదుగా సీమకిరణం దినపత్రిక 2022 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పత్రిక ద్వారా మన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రచురించడం ద్వారా పరిష్కార మార్గం మరింత సుగమం అవుతుందని సూచించారు. సమస్య తీవ్రత ను బట్టి సత్వర పరిష్కారానికి ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.