ANDHRABREAKING NEWSSPORTSSTATE
విజ్ఞాన శాస్త్రమే మానవ జీవన అభ్యుదయానికి సోపానం
విజ్ఞాన శాస్త్రమే మానవ జీవన అభ్యుదయానికి సోపానం
ప్యాపిలి, ఫిబ్రవరి 28, (సీమకిరణం న్యూస్) ;
ఆధునిక మానవ జీవన అభ్యుదయానికి విజ్ఞాన శాస్త్రం సోపానమని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సురేశ్ బాబు అన్నారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళిని అర్పించారు. తదనంతరం పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులు గోపాల్, తలిత కుమారి, విజయలక్ష్మి లను పూలమాల, కానుక, శాలువలతో సత్కరించారు. పాఠశాల తరపున సైన్సు ఉపాధ్యాయులయిన ప్రధానోపాధ్యాయుల వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆటో ఆటోమేటిక్ ఎర్త్ క్వేక్ ఇండికేటర్, సేవ్ ద వాటర్, పొల్యూషన్ నివారణలకు సంబంధించి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ ఈ ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, పర్యావరణసంరక్షణకు ప్రేరేపించే నాటికలు, సాంస్కృతిక అంశాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా నాయక్, ప్రేమ్ కుమార్, సునీల్, జ్యోతి, శేషయ్య, సుజాత మొదలవారు పాల్గొన్నారు.