ANDHRA
ప్రశ్నించే గొంతులనే ఎమ్మెల్సీ లుగా గెలిపించండి
ప్రశ్నించే గొంతులనే ఎమ్మెల్సీ లుగా గెలిపించండి
సి పి ఎం, డి వై యఫ్ ఐ, యస్ యఫ్ ఐ
ప్యాపిలి, ఫిబ్రవరి 28, (సీమకిరణం న్యూస్) :
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిని ఎమ్మెల్సీ లుగా గెలిపించాలని అభ్యర్థిస్తూ మంగళవారం నక్కలవాగుపల్లి, చిన్నపూజళ్ళ,పెద్ద పూజళ్ళ, ఓబుల దేవర పల్లి,మాన్ దొడ్డి, గడిపాడు,పి ఆర్ పల్లె గ్రామాలలో సి పి ఎం , యస్ యఫ్ ఐ,డి వై యఫ్ ఐ ప్రజా సంఘాల నాయకులు కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి పి ఎం జిల్లా నాయకులు,కోయిల కొండ నాగరాజు,నక్కీశ్రీకాంత్,డి వై యఫ్ ఐ జిల్లా అధ్యక్షులు మధు శేఖర్,యస్ యఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు విజయ్ పాల్గొని మాట్లాడుతూ 2023 మార్చి 13న జరిగే శాసన మండలి పట్టభద్రుల,టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలలో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజుకి,టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తద్వారా రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని పట్టభద్ర,టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లను అభ్యర్థిస్తూ వారికి విజ్ఞప్తి చేశారు.గ్రాడ్యుయేట్ కోటా క్రింద మేధావులను పంపవలసిన పెద్దల సభకు కూడా అన్ని రకాల అక్రమ పద్ధతులు అవలంబించి డబ్బు మూటలతో రాజకీయ వ్యాపారులను పంపడానికి పాలక,ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తాపత్రయ పడటం అన్యాయమన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారికి అండగా ఉంటూ వారి పోరాటాలకు ముందు నిలుస్తూ ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం నిరంతరం పోరాడుతూ, ఉద్యోగులకు సిపిఎస్ రద్దుపైన,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పైన,విద్యార్థులు,యువజనుల సమస్యల పైన,కార్మిక,కర్షక సమస్యల పైన,వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కొనసాగింపు పైన,అన్ని వర్గాల పేద ప్రజల పక్షాన నిలబడి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఉద్యమ సారథులు పోతుల నాగరాజు,కత్తి నరసింహారెడ్డి అని రాష్ట్ర భవిష్యత్తు కోసం అటువంటి నిస్వార్థపరులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని కనుక మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాలని పట్టభద్ర,టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.