ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
కనులవిందుగా సాగిన శ్రీ బసవేశ్వరుని రథోత్సవం

కనులవిందుగా సాగిన శ్రీ బసవేశ్వరుని రథోత్సవం
ముఖ్య అతిథిగా రాష్ట్ర వైకాపా సీనియర్ నాయకులు వై.సీతా రామిరెడ్డి,మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి
కోసిగి, మార్చ్ 02, (సీమకిరణం న్యూస్) :

కోసిగి మండలం జంపాపురం గ్రామంలో అతిపెద్ద స్వయంభూ నంది విగ్రహంతో బసవేశ్వరుని వెలసిన శ్రీ బసవేశ్వరుని రథోత్సవం కనువిందుగా గురువారం సాయంత్రం సాగింది.ఈ రథోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డితో కలిసి రాష్ట్ర వైకాపా సీనియర్ నాయకులు శ్రీ వై.సీతారామిరెడ్డి పాల్గొన్నారు.ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు. గ్రామ నాయకులు బసిరెడ్డి, సర్పంచ్ ఆరోన్ అద్వరంలో అతిధులకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు..ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు,యంపీపీ ఈరన్న,బెట్టనగౌడ్,జగదీష్ స్వామి,యన్.నాగరాజు,బుళ్ళి నరసింహులు,దొడ్డి నర్సన్న, వారం ఈరన్న,బొంపల్లి భీమయ్య,కురువ ఈరన్న,చిన్న బసిరెడ్డి,చిదానంద,ఇంద్రారెడ్డి , లక్ష్మీకాంత్ రెడ్డి,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.