ANDHRABREAKING NEWSSPORTSSTATE
గోనెగండ్లలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్ లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
గోనెగండ్ల , ఫిబ్రవరి 28 , ( సీమకిరణం న్యూస్ ) :
గోనెగండ్ల మండల పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ లో ప్రిన్సిపల్ షేక్ షాహిన పర్వీన్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ డాక్టర్ జి.రాఘవేంద్రనాథ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.వలి బాబు, మండల విద్యాధికారి కె.వినోద్ కుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పరమేశ్వర రెడ్డి పాల్గొని పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటుచేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులను తిలకించారు ఈ ఎగ్జిబిషన్లో అధిక వర్షాల వల్ల ప్రజలు ప్రాణాల నుంచి రక్షించుకునేందుకు స్మార్ట్ బ్రిడ్జి, బ్లూటూత్ కార్, సోలార్ వింట్ ఎనర్జీ వాటిపై విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు అనంతరం ప్రిన్సిపల్ షాహిన పర్వీన్ మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి పెంపొందించుకునేందుకు సైన్స్ వేర్ ఎంతో దోహదపడుతుంది ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు వారి సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు