ANDHRABREAKING NEWSSTATE
మృతుని కుటుంబానికి 10లక్షల చెక్
మృతుని కుటుంబానికి యెనో పాయ్ ప్రమాద బీమా ద్వారా 10లక్షల చెక్.
డోన్ టౌన్,మార్చ్02,(సీమ కిరణం న్యూస్):
ఎస్బిఐ యోనో పాయ్ ( ప్రమాద బీమా) ఈ మధ్యకాలంలో వెంకటనాయునిపల్లే కి సంబంధించి కే.రామకృష్ణయ్య అనే వ్యక్తికి పాము కాటు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అతను డోన్ ఎస్బిఐ బ్యాంకులో యోనో పాయ్ కింద 500 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించాడు. అతని మరణంతో నామిని ఆమె భార్య శ్రీదేవి కి 10లక్షల రూపాయలు చెక్కు ఎస్బిఐ చీఫ్ మేనేజర్ సచింద్ర బాబు, డిప్యూటీ మేనేజర్ రఘువేలు చేతుల మీదుగా నామినికి అందించారు. కావున ప్రతి కస్టమర్ ఎస్బిఐ యోనో పాయ్ చేయించుకోవలసినదిగా బ్యాంకు సిబ్బంది కోరుతున్నారు. వీటిలో పాము కాటుకు కూడా వర్తింప చేస్తుంది.