ANDHRA

-రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి :- జిల్లా కలెక్టర్.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి  :- 

జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-

పారిశుధ్యం మెరుగు పడాలి : 

ఆసుపత్రి ఆవరణమంతా పరిశుభ్రంగా ఉండాలి :-

ఆకస్మికంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ :-

సెక్యూరిటీ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన, రోగుల పట్ల ఆమర్యాదగా ప్రవర్తించిన చర్యలు తప్పవు :-

కర్నూలు కలెక్టరేట్ , మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన, రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు హెచ్చరించారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అత్యవసర చికిత్స విభాగం, సెక్యూరిటీ పనితీరు, గైనిక్ వార్డు పరిసర ప్రాంతం, డాక్టర్లు నివసిస్తున్న వసతి గృహాలు, ఆసుపత్రి లోని పారిశుధ్యం నిర్వహణ, వైద్య సేవలు తదితర వాటిని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అందులో భాగంగా క్యాజువాలిటీ వార్డులో రోగులకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంత మంది వైద్య సిబ్బంది ఉన్నారు, తదితర వివరాలను జి జి హెచ్ సూపరింటెండెంట్ ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రాయలసీమ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో రోగులు జిజిహెచ్ కు వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యం అందించాలని  జిల్లా కలెక్టర్ జిజి హెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. అత్యవసర చికిత్సా విభాగం, గైనిక్ వార్డులో సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉన్నారో లేదో జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా ఎవరెవరు ఏ ఏ వార్డు దగ్గర ఎంత మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వంటి విషయాలకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీలు వేసిన షీట్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బంది పై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని ఇక నుంచైనా మార్పు కనిపించకపోతే చర్యలు తప్పవని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను జిల్లా కలెక్టర్  హెచ్చరించారు. అలాగే డాక్టర్ లు నివసిస్తున్న వసతి గృహాల పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యంను జిల్లా కలెక్టర్ పరిశీలించి బాగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిజి హెచ్ సూపరింటెండెంట్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే బయోమెడికల్ వేస్ట్ గురించి జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. శానిటేషన్ సంబంధించి హాస్పిటల్ పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో పరిశుభ్రంగా ఉండేలా చూడటంతోపాటు ఆస్పత్రి ఆవరణమంతా క్లీన్ గా ఉండేలా చూడాలని పారిశుద్ధ్య నిర్వహణ సూపర్వైజర్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గారి వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర నాథ్ రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా.ప్రభాకర రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.జిక్కి, వైద్య అధ్యాపకులు డా.శివబల, ఏపీఎమ్ ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సదాశివరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!