క్రమశిక్షణతో చదివితేనే మంచి భవిష్యత్తు:
క్రమశిక్షణతో చదివితేనే మంచి భవిష్యత్తు:
డోన్ టౌన్, మార్చ్01,(సీమ కిరణం న్యూస్):
విద్యార్థులు క్రమశిక్షణ తో చదివితేనే మంచి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది అనీ పాతపేట ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మావతమ్మ అన్నారు. స్థానిక డోన్ పట్టణంలో బుధవారం ఉదయం ప్రభుత్వ ఎస్.సి.,బి.సి. బాలుర వసతి గృహం నందు చదువుకున్న విద్యార్థులకు సంరక్షకులు మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ, సీనియర్ ఉపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి, మరియు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు పద్మనాభ రెడ్డి పాల్గొన్నారు, హాస్టల్ విద్యార్థుల ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని యోగా, ధ్యానం చేయడం, ఆ తర్వాత స్టడీఅవర్ నందు పాల్గొని,సమయాన్ని వృదా చేయకుండా గడిపి, పాఠశాల యందు జరిగే తరగతులకు హాజరు కావాలని చెప్పారు, అలాగే సాయంత్రం కూడా జాగ్రత్తగా చదువుకుని, అందరి దృష్టి లో మంచి విద్యార్థులుగా గుర్తింపు పొందాలన్నారు,నేడు క్రమశిక్షణతో చదివితే రేపు మన జీవితమే మారిపోతుందన్నారు, ఈరోజు కష్టపడి చదివితే రేపు సుఖవంతమైన జీవితం గడపవచ్చన్నారు,ఇష్టపడి చదివితే విద్య మీ సొంతం అవుతుందన్నారు,సభ్య సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా జీవితం గడపాలని, అలాగే జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో అందరు విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనీకోరారు.ఈ సందర్భంగా హాస్టల్ సంరక్షకులు మధు ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు, ఈ కార్యక్రమం లో హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.