ANDHRABREAKING NEWSCRIME

పోలీసులకు  వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్  ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

• జిల్లాలో  జిల్లా ఎస్పీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు  సత్ఫలితాలు ఇస్తున్నాయనడానికి ఈ 5 మంది కానిస్టేబుళ్ళ యొక్క పని తనమే ఒక ఊదాహారణ

• సాంకేతికతను ఉపయోగిస్తూ పరిశోధనలతో కొత్త ఒరవడి సృష్టిస్తున్న కర్నూలు జిల్లా పోలీసులు

• జిల్లాలో నేరాల నియంత్రణకు ముఖ్యమైన ప్రదేశాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు

• రౌడీషీటర్లు మరియు తీవ్రమైన  నేరాలను ప్రత్యేకశ్రధ్ధతో కోర్టులో విచారణ

• సాక్షులను ప్రవేశపెట్టి తీవ్రమైన నేరస్తులకు శిక్షలు పడేవిధంగా బాధితులకు త్వరితగతిన న్యాయం అందజేలా ప్రణాళిక

  కర్నూలు క్రైమ్, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు జిల్లా ఎస్పీగా  సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసుసిబ్బందికి ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానం పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెల కు సంబంధించి మొత్తం 5 మంది పోలీసులను  వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కు  ఎంపిక చేసి  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ మంగళవారం ప్రశంసా పత్రాలను అందజేసి  అభినందించారు. విధుల పట్ల అంకితభావం, అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.విధి నిర్వహణలో ప్రతిభ ను గుర్తించి, ప్రోత్సాహకంగా అవార్డులను అందజేస్తే, విధుల్లో ఉత్సాహం పెరిగి, ఇంకా నిబద్ధతతో విధులు నిర్వహిస్తారని, మరింత చైతన్యవంతుల్ని చేసే ఉద్దేశ్యంతో వీక్లీ బెస్ట్ ఫర్మార్మెన్స్ అవార్డులు అందజేస్తున్నామని, ఇప్పటి వరకు మొత్తం 45 మంది  పోలీసుల ప్రతిభను గుర్తించి బెస్ట్ అవార్డులు అందజేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. సాంకేతికతను దర్యాప్తులలో ఉపయోగించే విధంగా పోలీసుసుసిబ్బందికి తర్ఫీదు ఇవ్వడంతో పోలీసు శాఖ సత్ఫలితాలు సాధిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. మర్డర్ కేసులలో ముద్దాయిలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గంటల్లోనే హత్య కేసులకు సంబంధించిన ముద్దాయిల అరెస్టు చేసి బాధితులకు పోలీసులు న్యాయం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారి చొరవతో పోలీసు సిబ్బందిని సాంకేతిక విభాగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలిస్తున్నాయి.

ఇందులో…

1) జె. రంగన్న (PC 1700)  –   కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్.

కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ కు సంబంధించిన 2014, 2015,  2016 సంవత్సరానికి సంబంధించి కోర్టు నుండి వచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్స్, సమన్స్ ను  తెలంగాణ, నంద్యాల, కోడుమూరు  ప్రాంతాలకు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. నిందితులను కోర్టు లో ప్రవేశ పెట్టడం జరిగింది. విజయవాడ, గుంటూరు, తెనాలి , కావలి కి చెందిన వివిధ ప్రాంతాల వారు  పోగొట్టుకున్న 55  మొబైల్ ఫోన్ లను రికవరి చేయడం జరిగింది.

2) చంద్రబాబునాయుడు , PC-3352,  కర్నూలు 3 వ పట్టణ పోలీసుస్టేషన్.

గంజాయి నిందితులను విచారణ చేస్తుండగా ఆ నిందితుల యొక్క సెల్ ఫోన్ లలోని గంజాయి మొక్కల ఫోటోలను చూశారు.క్రిష్ణగిరి మండలం, దేవమాడ గ్రామంలో గంజాయి మొక్కలు అమ్ముతున్నారని తెలుసుకుని మఫ్టీ పోలీసులుగా  పోలీసు బృందాలతో వెళ్ళారు. సీడ్స్ అమ్మే వాళ్ళము మేము అని  పొలాలో పండించడానికి సీడ్ విత్తనాలను టెస్టింగ్ కొరకు ఇస్తామని చెప్పి గ్రామంలో పరిచయాలు చేసుకున్నారు. వివరాలు తెలుసుకుని  పెద్ద లాలు అనే వ్యక్తి యొక్క మిరప తోట మధ్యలో  గంజాయి మొక్కలను పెంచుతున్నాడని తెలుసుకున్నారు.  ఒక గంజాయి మొక్క 3 వేల నుండి 4 వేలకు విక్రయిస్తున్నారని తెలుసుకుని క్రిష్ణ గిరి పోలీసులకు నిందితుడిని  అప్పగించారు.

3) ఓంకార్ రెడ్డి,  ఎఆర్ హెచ్ సి -1846, ఎఆర్ హెడ్ క్వార్టర్.

కర్నూలు ఆర్ముడు రిజర్వుడు హెడ్ క్వార్టర్ లో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ గా  ఓంకార్ రెడ్డి పని చేస్తున్నారు.  1992 బ్యాచ్ చెందిన వారు. కాకినాడ నుండి కర్నూలు జిల్లా కు  సబ్ ఇన్ స్పెక్టర్ , కానిస్టేబుల్  ప్రిలిమినరీ పరీక్ష పత్రాలను  ఎస్కార్ట్  డ్యూటిలు చేయడం లో మరియు  గ్రేహౌండ్స్, జిల్లా పోలీసు  శిక్షణ  కేంద్రంలో స్టైఫండరీ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ళకు  శిక్షణ ఇవ్వడంలో  బాగా పని చేశారు

4) పి.వి క్రిష్ణయ్య నాయుడు –  పిసి – 185 , ఆదోని మూడవ పట్టణ పోలీసుస్టేషన్ .

క్రైమ్ నెంబర్ 6/2023 U/S 382 ALTAR 394 IPC,
క్రైమ్ నెంబర్ O9/2023, U/s 379 IPC,
క్రైమ్ నెంబర్ 10/2023 U/S 379 IPC

ఆదోని త్రీ టౌన్  క్రైమ్ నెంబర్ లలో  ముద్దాయిలు అయిన షికారి ప్రేమేష్, వర్షమ్, వర్షనాయక్ , శీను నాయక్  కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితులు. 2022 లో  కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన  హత్య కేసులో కూడా వీరు నిందితులు గా  ఉన్నారు. ఆదోని, గుత్తి,గంతకల్లు, కర్నూలు, తెలంగాణ, మహబూబ్ నగర్, భద్రావతి, చిత్రదుర్గ, బెల్గాం, బళ్ళారి శివారులలో లారీల డ్రైవర్లు  నిద్రలోకి వెళ్ళినప్పడు  వారి నుండి సెల్ ఫోన్లు, డబ్బులు దొంగలించడం చేస్తున్నారు.

జనవరి లో ఈ సంఘటనలు జరిగాయి.

లారీల అద్దాలు కట్ చేసి నేరాలకు పాల్పడినట్లు సిసికెమెరాల రికార్డులలో తెలుసుకున్నారు. క్లూస్ టీం, ఫింగర్ ఫ్రింట్ ల ద్వారా దర్యాప్తులు చేపట్టారు. IME నెంబర్ ల ద్వారా కోసిగి మండలం, చిర్తనకల్లు గ్రామం లో విచారణ చేస్తే వివిధ భాషలలో మాట్లాడుతున్న షికారి వాళ్ళు దొంగలించిన సెల్ ఫోన్ లు అమ్మినారు అని  చెప్పారు.  ఆదోని శివారులలో నిందితులను అరెస్టు చేశారు. దొంగతనాలకు పాల్పడే టప్పుడు ఒక వేళ ఏవరైనా  పట్టుకోవడానికి ప్రయత్నస్తే పదునైనా కత్తితో హత్య చేయడానికి వెనుకాడరు. ఈ నిందితుల పై పోలీస్ స్టేషన్ కు  పలు ఫిర్యాదులు రావడంతో ఈ నిందితులను అరెస్టు చేశారు. వారి  నుండి 9 పదునైన కత్తులు , 60 సెల్ ఫోన్లు, 14 బైక్ లు, (26 లక్షల విలువ గల ఆస్తిని) స్వాధీనం చేస్తుకున్నారు. ఈ నిందితులను ఆదోని కోర్టులో ప్రవేశపెట్టారు.  ఆదోని సబ్ జైలు కు రిమాండుకు తరలించారు.

5) జి. నరేంద్ర –  పిసి – 3628 , ఆదోని మూడవ పట్టణ పోలీసుస్టేషన్ .

క్రైమ్ నెంబర్ 6/2023 U/S 382 ALTAR 394 IPC,
క్రైమ్ నెంబర్ O9/2023, U/s 379 IPC,
క్రైమ్ నెంబర్ 10/2023 U/S 379 IPC

ఆదోని త్రీ టౌన్  క్రైమ్ నెంబర్ లలో  ముద్దాయిలు అయిన షికారి ప్రేమేష్, వర్షమ్, వర్షనాయక్ , శీను నాయక్  కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితులు.2022 లో  కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన  హత్య కేసులో కూడా వీరు నిందితులుగా  ఉన్నారు. ఆదోని, గుత్తి,గంతకల్లు, కర్నూలు, తెలంగాణ, మహబూబ్ నగర్, భద్రావతి, చిత్రదుర్గ, బెల్గాం, బళ్ళారి శివారులలో లారీల డ్రైవర్లు  నిద్రలోకి వెళ్ళినప్పడు  వారి నుండి సెల్ ఫోన్లు, డబ్బులు దొంగలించడం చేస్తున్నారు.

జనవరి లో ఈ సంఘటనలు జరిగాయి.

లారీల అద్దాలు కట్ చేసి నేరాలకు పాల్పడినట్లు సిసికెమెరాల రికార్డులలో తెలుసుకున్నారు. క్లూస్ టీం, ఫింగర్ ఫ్రింట్ ల ద్వారా దర్యాప్తులు చేపట్టారు. IME నెంబర్ ల ద్వారా కోసిగి మండలం, చిర్తనకల్లు గ్రామం లో విచారణ చేస్తే వివిధ భాషలలో మాట్లాడుతున్న షికారి వాళ్ళు దొంగలించిన సెల్ ఫోన్ లు అమ్మినారు అని  చెప్పారు.  ఆదోని శివారులలో నిందితులను అరెస్టు చేశారు. దొంగతనాలకు పాల్పడే టప్పుడు ఒక వేళ ఏవరైనా  పట్టుకోవడానికి ప్రయత్నస్తే పదునైనా కత్తితో హత్య చేయడానికి వెనుకాడరు. ఈ నిందితుల పై పోలీస్ స్టేషన్ కు  పలు ఫిర్యాదులు రావడంతో ఈ నిందితులను అరెస్టు చేశారు. వారి  నుండి 9 పదునైన కత్తులు , 60 సెల్ ఫోన్లు, 14 బైక్ లు, (26 లక్షల విలువ గల ఆస్తిని) స్వాధీనం చేస్తుకున్నారు. ఈ నిందితులను ఆదోని కోర్టులో ప్రవేశపెట్టారు.  ఆదోని సబ్ జైలు కు రిమాండుకు తరలించారు. బెస్ట్  అవార్డులను తీసుకున్న కానిస్టేబుళ్ళు  పోలీసుశాఖలో ,  సమాజంలో, ఇంట్లో ఒక గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే అవార్డులు , గుర్తింపులు  కేవలం అధికారులకే మాత్రమే కాకుండా క్రింది స్ధాయి సిబ్బంది కానిస్టేబుళ్ళ కూడా ఇవ్వడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీకి  ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!