ANDHRABREAKING NEWS

14న  “స్పందన”  కార్యక్రమం :-

14న  “స్పందన”  కార్యక్రమం :-

కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో “స్పందన”  కార్యక్రమం :-

– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు

కర్నూలు కలెక్టరేట్ , మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :

ఈ నెల 14వ తేదీ కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో “స్పందన”  కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.  ఫిర్యాదుల స్వీకరణ అనంతరం పరిష్కారంపై  జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న సమీక్ష కు మండల స్థాయి అధికారులు అందరూ సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయాల నుండి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.

Related Articles

Back to top button
error: Content is protected !!