రంజాన్ కు ఏర్పాట్లు పూర్తి : ఈవో హుస్సేన్
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మార్చ్ 23, (Seema Kiranam News) :
మండల కేంద్రమైన ఏఎస్ పేట (రహమతాబాద్) లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వాముల వారి దర్గాలో పవిత్ర రంజాన్ మాసానికి సంబంధించి ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు స్టేట్ వక్ఫ్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ దర్గా ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) మొహమ్మద్ హుస్సేన్ తెలిపారు ఆయన గురువారం దర్గా వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే భక్తుల కొరకు తెల్లవారుజామున “సైరీ” సాయంత్రం “ఇఫ్తారీ” లో అన్నదాన ఏర్పాటు తోపాటు ఉపవాసాలు ఉండే భక్తుల కొరకు సాయంత్రం “ఆష్ “గంజి” చల్లటి తాగునీరు తదితర వాటినీ ఏర్పాటు చేయనున్నామని ఈ రంజాన్ నెల మొత్తం దర్గా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్టు పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించామన్నారు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే భక్తులకు దర్గా తరఫున అన్ని ఏర్పాట్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేయనున్నామన్నారు పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలైన తరాబి నమాజ్ కొరకు హైదరాబాద్ నుండి ప్రత్యేక ఇమామ్ ను పిలవడం జరిగిందని గతంలో కంటే మెరుగ్గా అన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు