క్రీడాకారుల సంక్షేమానికి శ్రీధర్ రెడ్డి చేస్తున్న కృషి వెలకట్టలేనిది
– జిల్లా క్రీడా శాఖ సీఈవో పివి రమణ.
కర్నూలు టౌన్, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
ప్రతిభగల యువ క్రీడాకారులు రాణించేందుకు వారి సంక్షేమానికి నిరంతరం పాటు పడుతున్న న్యాయవాది శ్రీధర్ రెడ్డి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని జిల్లా క్రీడా శాఖ సీఈవో రమణ అన్నారు.మంగళవారం జిల్లా క్రీడా అధికార సంస్థ ఆవరణలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను న్యాయవాది శ్రీధర్ రెడ్డి,జిల్లా యోగా సంఘం అధ్యక్షుడు దండు లక్ష్మి కాంత్ రెడ్డి తో కలసి అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా క్రీడా శాఖ సీఈఓ రమణ మాట్లాడుతూ ఆన్లైన్ యోగ తరగతుల నిర్వహణ కోసం న్యాయవాది శ్రీధర్ రెడ్డి 40 వేల విలువగల లాప్ టాప్ వితరణ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం న్యాయవాది శ్రీధర్ రెడ్డి, జిల్లా యోగా సంఘం అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ ఈనెల 24 నుంచి 29 వరకు రాజస్థాన్ లోని పాలి నగరంలో జరగబోయే 47వ జాతీయ స్థాయి సీనియర్ యోగాసన పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.జిల్లా యోగ సంగం కార్యదర్శి అవినాష్ శెట్టి,సాయి, గంగాధర్, పోటీలకు ఎంపికైన క్రీడాకారులు లాలన ప్రియ, అక్షర, రంగ స్వామి తదితరులు పాల్గొన్నారు