శ్రీ వడ్డెగేరి సుంకులమ్మ అమ్మవారు ఉత్సవ పల్లకి ఊరేగింపు సంబరాలు
కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లుర్తిలో 11వ వార్డులో వేప చెట్టు వేరులో స్వయంభుగా వెలిసిన వడ్డెగేరి సుంకులమ్మ అమ్మవారు శోభకృత్ నామ కొత్త సంవత్సరం ఉగాది పండగ పర్వదినాన అమ్మవారు సుంకులమ్మ దేవి విగ్రహాన్ని పుర వీధుల్లో మహిళలు యువకులు భక్తులు ఉత్సవ సేవ పల్లకిలో ఊరేగించారు. మరియు సుంకులమ్మ దేవి ఆలయ సభ్యులు డి. పుల్లయ్య, వి.చిరంజీవి మాట్లాడుతూ. గత పెద్దలు 500 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయ కట్టుబాట్లు ఇలాగే కొనసాగించుకుంటూ వస్తున్నామని, సుంకులమ్మ అమ్మవారు స్వయంభుగా వెలిసి ఉగాది పర్వదినాన అమ్మవారి ఊరేగింపు మరి రెండో రోజున భక్తులు అమ్మవారికి ఐదు బావుల నీళ్లు తెచ్చి అమ్మవారికి శిరస్సున పోసి అమ్మవారి కృప కటాక్షం మాపై ఉంటుందని భక్తుల గట్టి నమ్మకమని అన్నారు. సాయంకాలం సుంకులమ్మ వారి అక్కకు మారెమ్మ అమ్మవారు ఒంటి గంట సమయంలో భక్తులు మహిళలు బోనాలు సమర్పించి అదే రోజున సాయంకాలం 5, 6, గంటల సమయంలో సుంకులమ్మ అమ్మవారికి భక్తులు జొన్న సంకటి అమ్మ వారికి నైవేద్యం పెట్టి మహిళలు బోనాలు అమ్మవారికి సమర్ధించుతామని వారు తెలిపారు. చెట్టు వేరు అమ్మవారి రూపంలో వెలిసినడంతో సుంకులమ్మ అమ్మవారి విగ్రహం 1995లో విగ్రప్రతిష్ట చేయడం జరిగిందని సుంకులమ్మ అమ్మవారు కొలిచిన వారికి కొంగుబంగారం ఆ తల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసి చేసే బోనాల జాతర పండగ ఉగాది అని తెలిపారు. వడ్డెగేరి వెలిసిన సుంకులమ్మ అమ్మవారికి ఉగాది పండగ సందర్భంగా వెండి ప్రమిదలు విరాళం ఇచ్చిన దాతలు తండ్రి కీర్తిశేషులు విరుపాక్షయ్య గ్యాపకంగుర్తుతో తమ కుమార్తె ఖమ్మం పల్లి రాధమ్మ వారి కుటుంబ సభ్యులు వీటిని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అయ్యన్న శీను పుల్లయ్య చిరంజీవి మరియు తదితరులు పాల్గొన్నారు.