
-: బిజెపి కుట్రలో భాగమే రాహుల్ పై అనర్హత వేటు
-: కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ
కర్నూలు టౌన్, మార్చి 25, (సీమకిరణం న్యూస్):
ప్రశ్నించే తత్వాన్ని తట్టుకోలేకనే బిజెపి కుట్రలో భాగమే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం జరిగిందనీ కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ ఆరోపించారు. శుక్రవారం పాణ్యం నియోజకవర్గ పరిధలోని నంద్యాల చెక్ పోస్ట్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధు లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“భారతదేశ ప్రజాస్వామ్య చరిత్ర లో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని నరేంద్రమోదీ దురంహంకారా నికి, నియంతృత్వానికి పరా కాష్ట అని అభివర్ణించారు. రాజ్యాంగ బద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజా స్వామ్య వేదిక అయిన పార్ల మెంటు ను సైతం తమ హేయ మైన చర్యలకోసం మోదీ ప్రభు త్వం వినియోగించు కోవడం గర్హనీయమన్నారు. ప్రజా స్వామ్యానికి రాజ్యాంగ విలువ లకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించి పోతున్నదన్నారు. ప్రతి పక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదనీ,దేశంలో ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగ విలువ లను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాల న్నారు. బిజేపి దుర్మార్గ విధా నాలనుప్రతిఘటించాలి..”ఆర్టికల్ 19 ప్రకారం బావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించడమే రాజ్యాం గాన్ని తూట్లు పొడుస్తున్న బిజెపి ప్రభుత్వం గుజరాత్ అల్లర్లు గతంలో నరేంద్ర మోడీ, అమిత్ షా చేసినటువంటి శాశ్వ తంగా రాజకీయాల్లో పోటీ చేయకుండా రద్దు చేయా ల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మతయుద్వేషాలు కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి బిజె పి ప్రభుత్వం దేశ ప్రజలు ఇంటి కి స్వాగనoపడానికి సిద్ధంగా ఉన్నారని లక్ష్మీ నరసింహ హెచ్చరించారు.