సీఎం బోయ వాల్మీకి కులాలను ఎస్టీలుగా ప్రకటించడం తగదు
-: తీర్మానాన్ని ఖండిస్తున్న లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కైలాష్ నాయక్
కర్నూలు టౌన్, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
అసెంబ్లీలో బోయ వాల్మీకి కులాలను ఎస్టీలుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రక టించడం తగదని, ఈ అసెంబ్లీ తీర్మానాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్య క్షులు ఆర్, కైలాష్ నాయక్ తీవ్రంగా ఖండిచారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బోయ వాల్మీకి కులాలను ఎస్టీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా ప్రకటించడం చాలా దారుణం అన్నారు. ఇది కచ్చితంగా మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన లంబాడీలపై కక్ష పూరిత చర్యయేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడమే నిలువెత్తు నిదర్శనం అన్నారు. దీనివల్ల లక్షలాది గిరిజన ప్రజలు మనో వేదనకు గురి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజమైన గిరిజన ప్రజలు గడిచిన నాలుగేళ్ళలో పనులు లేక ఉపాధి లేక పూట గడవక ఇతర ప్రాంతాలకు వెళ్లి బ్రతుకు తున్నారని గుర్తు చేశారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర ముఖ్య మంత్రికి తెలుసన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని గమనిస్తే ఇది కక్ష పూరితంగా మైదాన ప్రాంత గిరిజనులకు అణగదొక్కడానికి జరుగుతున్న చర్యలుగా తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికీ మించినది ఏమీ లేదని అసెంబ్లీలో ఇతర కులాలని షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో చేరుస్తామని చేసిన తీర్మానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన లేని ఎడల రాష్ట్రంలోని గిరిజన కులాలు వాటికి సంబంధించిన సంఘాలు అన్నీ కూడా ఐక్యమత్యంతో మాహక్కులు సాధించు కోవడానికి ముందుకు వస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్నీ హెచ్చరించారు.