
ఏపీజేఎఫ్ ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్స్ ఫోరమ్ కర్నూలు జిల్లా శాఖ నూతన కమిటీ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ (ఏపీజేఎఫ్) అనుబంధం విభాగమైన ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్స్ ఫోరమ్ కర్నూలు జిల్లా శాఖ నూతన కమిటీ ఎన్నికైంది. శనివారం స్థానిక బిర్లా కాంపౌడ్ లోని ఏపీజేఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏపీజేఎఫ్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఏపీజేఎఫ్ జిల్లా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ నాయుడు, రాష్ట్ర నాయకులు హరినాథ్ రెడ్డి, మధు సుధాకర్, శ్రీకాంత్,గోపాల్ సిటిజన్ శ్రీనివాసులు. ఉరుకుందు తదితరులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్స్ ఫోరమ్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం. రామస్వామి, ప్రధాన కార్యదర్శి యు. శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా మధు సుధన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రాజు, కోశాదికారీగా సురేష్, సభ్యులుగా శశి, శివయ్య, మహేష్, , ప్రసాద్, శివకుమార్ తదితరులు ఎన్నికైనారు. ఈ సందర్బంగా నూతన కమిటీ సభ్యులకు ఏపీజేఎఫ్ జిల్లా, రాష్ట్ర నాయకులు అభినందించారు. నూతనంగా ఎన్నికైన ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్స్ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు ఎం. రామస్వామి మాట్లాడుతు తనకు అప్పగించిన భాద్యతలను తుచా తప్పకుండా నెరవేరుస్తా అని అన్నారు. జిల్లాలోని ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్స్ సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్స్ కమిటీలను త్వరలోనే వేసి స్థానిక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుదర్శన్. కే రాఘవేంద్ర గౌడ్. సుబ్బన్న. తదితరులు పాల్గొన్నారు