ANDHRA

-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం

మంత్రి గౌతమ్ రెడ్డి కి ఘన నివాళి

ఎంపీపీ కె.రఘునాథ్ రెడ్డి

ఆత్మకూరు, సంగం, మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ  దినోత్సవం సందర్భంగా సంగం మండల  వైసీపీ సీనియర్ నాయకులు ఎంపీపీ కంట బత్తిన రఘనాథ్ రెడ్డి  ఆధ్వర్యంలో శనివారం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రమైన సంఘం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద వైసీపీ సీనియర్ నాయకులు కె. రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా  వైఎస్ఆర్ సీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది,అని తెలిపారు. మా నాయకుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  ఈ సంవత్సరం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి లేకపోవడం చాలా బాధాకరం, ఎన్నో సంవత్సరాల నుండి ఆయనతో సొంత తమ్ముడు లాంటి పరిచయం ఉంది, ఆయన లేకపోవడం అందరికీ కొంత బాధ కలిగించినా నాకు మాత్రం మా ఇంట్లో పెద్దన్న చనిపోయినట్లుగా నేను భావిస్తున్నాను, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌతమ్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి కి నివాళులు అర్పించిన తర్వాత, సంగం బ్యారేజీ కి  మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతానని తెలపడం చాలా సంతోషం గా వుంది ,  మా సంగం మ్యారేజ్ లో ప్రతి నీటి బొట్టు లో, మా గౌతమ్ రెడ్డి అన్న ను చూసుకుంటానని ఆయన అన్నారు, మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి ఈ సమయంలో నేను నా కార్యకర్తలు అభిమానులు ఎంతో సపోర్టుగా ఉంటామని అన్నారు ,  ఈ కార్యక్రమం లో సంగం జడ్పీటీసీ రావుల ప్రసాద్ ,మాజీ జడ్పీటీసీ దేవసహాయం , గాంధీజన సంగం సర్పంచ్ మణికల చందన్ కుమార్ , చెన్నవరప్పాడు వైసిపి నాయకులు పేట మల్లికార్జున , దువ్వూరు వైసిపి నాయకులు రాము ,మహబూబ్ బాషా, నెల్లూరు కోటరెడ్డి ,అమరనాధ్ రెడ్డి , జనార్దన్ రెడ్డి, ప్రసాద్ , మన మీడియా మేనేజంగ్ డైరెక్టర్, భాస్కర్, శివ, కరుణాకర్, మురళి,వేణు, వాసు,మణి తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Back to top button
error: Content is protected !!
20:32