నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట లో వెలిసి ఉన్న మీర్జా బాబా గంధమహోత్సవం సోమవారం రాత్రికి వైభవంగా నిర్వహించారు. గంధమును అత్తరు పన్నీరు సుగంధ ద్రవ్యాలతో కలిపి గంధ కలశమును మస్తాన్ బెగ్ ఇంటి నుండి కుమారుడు రసూల్ తలపై ఉంచి బాణాసంచా కాలుస్తూ మేళతాళాలతో ఫకీర్ల జరబులతో భక్తి కీర్తనలతో ఊరేగింపుగా బయలుదేరి ముందుగా స్థానిక పెద్ద దర్గా లో గంధం ఎక్కించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫక్రుద్దీన్ బాబా దర్గాలో ప్రార్థన నిర్వహించి గంధమును మీర్జా బాబా దర్గాకు చేర్చారు అక్కడ గంధమును మీర్జా బాబా సమాధికి గంద లేపనం చేసి భక్తులకు గంధ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక సలాములు పాడి దువా చేశారు గ్రంథమును తిలకించడానికి భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు ఎం షానవాజ్ బెగ్, ఎం జాకీర్ బేగ్, మహబూబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. గంధమహోత్సవం సందర్భంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉరుసు దీపాలంకరణ బుధవారం తహలీల్ ఫాతిహా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.