హోళగుంద, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
హోళగుంద మండల కేంద్రంలోని బస్టాండ్ లో ట్రాఫిక్ సమస్య తీవ్రoగా ఉంది. నాలుగు బస్సులు బస్టాండ్ లో నిలబడితే చాలు ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. హోళగుందకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బళ్లారి,శిరుగుప్ప డిపోలకు చెందిన బస్సులు వస్తుంటాయి. అలాగే మూడు ప్రైవేట్ బస్సులు కూడా తిరుగుతాయి. ఈ క్రమంలో బస్సులు వచ్చి బస్టాండ్ లో నిలబడితే, ఇతర వాహనాలు బస్టాండును దాటి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతల సమయంలో ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా తీవ్రతరమవుతుందని . బస్టాండు స్థలం ఇరుకుగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని, ఈ విషయం గురించి వివిధ పత్రికలలో పలుమార్లు వార్తలు వచ్చిన సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాహనదారులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని వాహనదారులు కోరుతున్నారు.