అంగరంగ వైభవంగా ఉస్తాద్ బాబా ఉత్సవం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 05, (సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రమైన ఏఎస్ పేట రహమతాబాద్ లో వెలిసిన హజరత్ మీర్జా మహమ్మద్ హుస్సేన్ బేగ్ ఉరఫ్ ఉస్తాద్ బాబా స్వాముల వారి గంధ మహోత్సవం మంగళవారం రాత్రికి అంగరంగ వైభవంగా నిర్వహించారు గంధమును సుగంధ ద్రవ్యాలు అత్తరు పన్నీరులతో కలిపి గంధ కలశములను సజ్జాద నషీన్ అబ్బాస్, మేనేజ్మెంట్ మహమ్మద్ రహమత్ అలీ, ఉస్తాద్ బాబా మూడవ కుమారుడు రహమతుల్లా బేగ్ లు తలపై ఉంచుకొని మేళ తాళాలతో, ఫకీరుల జరబులతో, భక్తి కీర్తనలతో, బాణాసంచా కాలుస్తూ అంగరంగ వైభవంగా ఊరే ఇస్తూ ముందుగా స్థానిక పెద్ద దర్గా ఖాజా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాకు చేర్చి గంధ లేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అక్కడినుండి ఫక్రుద్దీన్ బాబా దర్గాకు వెళ్లి అక్కడ స్వామి వారి సమాధికి గంద లేపనం చేసి ప్రార్థన నిర్వహించారు అనంతరం ఉస్తాద్ బాబా దర్గాకు చేరుకొని స్వామివారి సమాధులకు గంధ లేపనం చేశారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సలాముల పాడి, దువా చేసి, సిజరా, చదివారు భక్తులకు గంధ ప్రసాదాలు పంచిపెట్టారు గంధ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా హాజరయ్యారు గంధ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక అన్నదానం నిర్వహించి ఖవాలి పాటకచేరి ఏర్పాటు చేశారు గంధ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ షేక్ ఖలీల్, జిల్లా వక్ఫ బోర్డ్ చైర్మన్ షేక్ మీరా, మైనారిటీ నాయకులు హంజ హుసేని, జిల్లా వైసీపీ మైనారిటీ ప్రెసిడెంట్ సిద్ధిఖ్,వక్ఫ్ బోర్డ్ జిల్లా వైస్ చైర్మన్ షౌకత్ అలీ, జిల్లా వక్ఫ్ బోర్డ్ సభ్యులు సయ్యద్ షాజహాన్ ఖాద్రి వుల్ షష్టి , స్థానిక మత పెద్దలు పఠాన్ ఫయాజ్ అహ్మద్ ఖాన్, మాజీ డి ఎం డబ్ల్యు హెడ్ మాస్టర్ మహమ్మద్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు, సంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ ఎం రవి నాయక్ , ఎస్ఐ నరేష్ లు ఉస్తాద్ బాబా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.