కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన వికాస్ మర్మత్
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 07, (సీమకిరణం న్యూస్):
వికాస్ మర్మత్ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా భాద్యతలు చేపట్టారు. శుక్రవారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు నూతన జాయింట్ కలెక్టర్ వికాస్ మర్మత్ బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కడప జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గాను, శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించి అడిషనల్ డైరెక్టర్ గ్రామ సచివాలయ, వార్డు సెక్రటరీ డిపార్ట్ లో విధులు నిర్వహించానని. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జేసీ రామసుందర్ రెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించానని అన్నారు.
అంతకుముందు కలెక్టర్ పి కోటేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసి కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించానని అన్నారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ వాసి అయిన వికాస్ మర్మత్ కాన్పూర్ ఐఐటీలో 2017లో బీటెక్ పూర్తి చేసి సోషియాలజీ ఆప్షనల్ గా 2018లో ఐఏఎస్ ఎంపిక అయినానని. మొదటి ప్రయత్నంలోనే 473 దేశస్థాయిలో ర్యాంకు సాధించి ఐఏఎస్ అర్హత సాధించానని. రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఐఏఎస్ కు ఎంపికైన జేసీ వికాస్ మర్మత్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు ఐఏఎస్ అధికారిగా కేటాయించారు. వీరి తండ్రి గుజరాత్ రాష్ట్రంలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ డిపార్ట్మెంట్లో అధికారిగా పనిచేస్తున్నారు. కర్నూల్ డిఆర్ఓ నాగేశ్వరరావు, ఆర్డిఓ హరి ప్రసాద్, కర్నూల్ తహసిల్దార్ శివ రాముడు తదితరులు జాయింట్ కలెక్టర్ కు స్వాగతం పలికారు.