జర్నలిస్టుల స్థలాల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి
జర్నలిస్టుల స్థలాల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి హెచ్చరిక
కర్నూలు టౌన్, ఏప్రిల్ 07, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు నగర శివారు లోని జగన్నాథ గట్టులో జర్నలిస్టులో కేటాయించిన స్థలాల్లో అక్రమంగా చేపట్టిన ఎర్రమట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం జగన్నాథ గట్టు లోని జర్నలిస్టు స్థలాల్లో అక్రమంగా తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. పాలకులు అధికారులు పట్టించుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇదే అంశంపై సీఎం కూడా లేక రాస్తామని, స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు. జగన్నాథగట్టు జర్నలిస్టు స్థలాల్లో తవ్వకాలను పరిశీలించిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్నాథం, సీపీఐ నగర ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్
లెనిన్ బాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ సమితి సభ్యులు కొండప్ప, నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ ఎన్ రాజు శ్రీనివాస్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి శివ, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చిన్న రామాంజనేయులు, నగర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.