ANDHRA

గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ : ఎంపీపీ కే. రఘునాథ్ రెడ్డి

గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ

ఎంపీపీ కే. రఘునాథ్ రెడ్డి

 ఆత్మకూరు, సంగం,  మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :

దివంగత నేత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును సంగం బ్యారేజీ కి పెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమని సీనియర్ వైసీపీ నాయకులు మండల ఎంపీపీ కే రఘునాథ్ రెడ్డి కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రమైన సంఘం వైసీపీ కార్యాలయంలో విలేకరు లతో శనివారం మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు. అనుచరులు… అభిమానులు ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అంటూ ఓ సినీ కవి స్నేహం గొప్పతనాన్ని గురించి అద్భుతంగా వివరించారనీ ఆయన తెలిపారు. నిజమే.. సృష్టిలో తీయనిది స్నేహమే అంటారు. స్నేహం విలువ తెలిసినవారు. అలాంటి స్నేహబంధానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్నేహం పట్ల తనకున్న అపారమైన విశ్వాసాన్ని చాటుకున్నారు. ఇటీవల దివంగతుడై తన ఆత్మీయ మిత్రుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి శాసన సభలో ఘనమైన నివాళి అర్పించారు. తమ స్నేహ మాధుర్యానికి చెరిగిపోని గుర్తుగా నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమరెడ్డి పేరు పెట్టాలని, తద్వారా తన మిత్రుడి పేరును శాశ్వతం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించి అందరి హర్షధ్వానాలు అందుకున్నారు. అంతేకాదు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరిన మూడు కోరికలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రజలు, ముఖ్యంగా గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు ప్రాంత ప్రజలు, అభిమానులు, అనుచరులు సిఎం తీసుకున్న ఈ సముచితమైన నిర్ణయాలకు ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివప్రసాద్,జనార్దన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!