BREAKING NEWSWORLD

వైయస్సార్ జలకళ రైతులకు వరం

వైయస్సార్ జలకళ రైతులకు వరం

మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి

ప్యాపిలి, మార్చి 12, (సీమకిరణం న్యూస్) :

ప్యాపిలి మండల పరిధిలోని ఏనుగుమర్రి గ్రామంలో వైయస్సార్ జలకళ పథకం కింద పొలంలో ఉచిత బోరు వేసే కార్యక్రమాన్ని జడ్పిటిసి బోరెడ్డి శ్రీరామిరెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ మదన్ మోహన్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ జలకళ పథకం రైతులకు ఓ వరమని , రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బోరెడ్డి రాము, ఎపిఓ వేంకట రమణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!